Connect Christ

Telugu Bible · Old Testament

1 దినవృత్తాంతములు 25

1 Chronicles 25 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు... హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా

2ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అష ర్యేలా అనువారు.

3​యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.

4​హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమీ్తయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.

5వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అను గ్రహించి యుండెను.

6​వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి.

7యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.

8తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.

9మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.

10మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

11నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

12అయిదవది నెతన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

13ఆరవది బక్కీయాహు పేరటపడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

14ఏడవది యెషర్యేలా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.

15ఎనిమిదవది యెషయా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

16​తొమి్మదవది మత్తన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

17​పదియవది షిమీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

18​పదకొండవది అజరేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

19​పండ్రెండవది హషబ్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

20​పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

21​పదునాలుగవది మత్తిత్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

22​​పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

23పదునారవది హనన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

24​పదునేడవది యొష్బెకాషా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25పదునెనిమిదవది హనానీపేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

26పందొమి్మదవది మల్లోతి పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.

27ఇరువదియవది ఎలీయ్యాతా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

28ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

29ఇరువది రెండవది గిద్దల్తీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండు గురు.

30ఇరువది మూడవది మహజీయోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

31​ఇరువది నాలుగవది రోమమీ్తయెజెరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.