Connect Christ

Telugu Bible · Old Testament

1 దినవృత్తాంతములు 8

1 Chronicles 8 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,

2మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.

3బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు

4అబీషూవ నయమాను అహోయహు

5గెరా షెపూపాను హూరాము

6ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;

7​నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.

8వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక

9తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును

10​యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.

11​హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.

12​ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.

13​​బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.

14అహ్యోషాషకు యెరేమోతు

15జెబద్యా అరాదు ఏదెరు

16మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.

17జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు

18ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.

19యాకీము జిఖ్రీ జిబ్ది

20ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.

21అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమా రులు.

22ఇష్పాను ఏబెరు ఎలీయేలు

23అబ్దోను జిఖ్రీ హానాను

24హనన్యా ఏలాము అంతోతీయా

25ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.

26​షంషెరై షెహర్యా అతల్యా

27​యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.

28​వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.

29​గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;

30​ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు

31​గెదోరు అహ్యో జెకెరు అనువారు.

32మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి.

33​నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.

34​​యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

35​మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.

36​ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

37మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.

38ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.

39అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.

40ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.