Connect Christ

Telugu Bible · Old Testament

ఆదికాండము 11

Genesis 11 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.

2వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి

3మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.

4మరియు వారుమనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా

5యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.

6అప్పుడు యెహోవాఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండద

7గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.

8ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.

9దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందు కనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.

10షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.

11షేము అర్పక్షదును కనినతరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

12అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.

13అర్పక్షదు షేలహును కనినతరువాత నాలుగు వందలమూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

14షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.

15షేలహు ఏబెరును కనినతరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

16ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.

17ఏబెరు పెలెగును కనినతరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

18పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.

19పెలెగు రయూను కనినతరువాత రెండువందల తొమి్మది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

20రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.

21రయూ సెరూగును కనినతరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

22సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.

23సెరూగు నాహోరును కనినతరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

24నాహోరు ఇరువది తొమి్మది యేండ్లు బ్రదికి తెరహును కనెను.

25నాహోరు తెరహును కనినతరు వాత నూటపం దొమి్మది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

26తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహో రును హారానును కనెను.

27తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహో రును హారానును కనెను. హారాను లోతును కనెను.

28హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణ ములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను.

29అబ్రామును నాహోరును వివాహము చేసి కొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.

30శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.

31తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.

32తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.