Connect Christ

Telugu Bible · Old Testament

యోబు 10

Job 10 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినదినేను అడ్డులేకుండ అంగలార్చెదనునా మనోవ్యాకులము కొలది నేను పలికెదను

2నా మీద నేరము మోపకుండుమునీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను.

3దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుటసంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?

4నీ నేత్రములు నరుల నేత్రములవంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించు వాడవా?

5నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములవంటివా?

6నేను దోషిని కాననియునీ చేతిలోనుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు

7నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?

8నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించి యున్ననునీవు నన్ను మింగివేయుచున్నావు.

9జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి,ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుమునీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?

10ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదాజున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా.

11చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివిఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.

12జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివినీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.

13అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయ ములో ఆలోచించితివిఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును.

14నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువునా దోషమునకు పరిహారము చేయకుందువు.

15నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగునునేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొనినాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

16­నేను సంతోషించినయెడలఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు.

17సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువుఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవుఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవుఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు.

18గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండినయెడల మేలు;

19అప్పుడు నేను లేనట్లే యుండియుందునుగర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.

20నా దినములు కొంచెమే గదాతిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు

21అంధకారము మరణాంధకారముగల దేశమునకు

22కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకుభ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకువెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందుకొంతసేపు నేను తెప్పరిల్లునట్లునన్ను విడిచి నా జోలికి రాకుండుము.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.