Telugu Bible · Old Testament
యోబు 19
1అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను
2ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు?ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?
3పదిమారులు మీరు నన్ను నిందించితిరిసిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.
4నేను తప్పుచేసినయెడలనా తప్పు నా మీదికే వచ్చును గదా?
5మిమ్మను మీరు నామీద హెచ్చించుకొందురా?నా నేరము నామీద మీరు మోపుదురా?
6ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియుతన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి.
7నామీద బలాత్కారము జరుగుచున్నదని నేనుమొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదుసహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.
8నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు.నా త్రోవలను చీకటి చేసియున్నాడు
9ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడుతలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.
10నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతినిఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను.
11ఆయన నామీద తన కోపమును రగులబెట్టెనునన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.
12ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరినా గుడారముచుట్టు దిగిరి.
13ఆయన నా సోదరజనమును నాకు దూరముచేసియున్నాడునా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.
14నా బంధువులు నాయొద్దకు రాకయున్నారునా ప్రాణస్నేహితులునన్ను మరచిపోయియున్నారు.
15నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగాఎంచెదరునేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.
16నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడునేను వాని బతిమాలవలసి వచ్చెను.
17నా ఊపిరి నా భార్యకు అసహ్యమునేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.
18చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరునేను లేచుట చూచినయెడల బాలురు నామీదదూషణలు పలికెదరు.
19నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతినినేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.
20నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని యున్నవిదంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది
21దేవుని హస్తము నన్ను మొత్తియున్నదినామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీదజాలిపడుడి.
22నా శరీరమాంసము పోవుట చాలుననుకొనకదేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుము దురు?
23నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరు చున్నాను.
24అవి యినుపపోగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను.
25అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాతఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
26ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.
27నామట్టుకు నేనే చూచెదను.మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయననుచూచెదనునాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి
28జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొనిమీరుమేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన యెడల
29మీరు ఖడ్గమునకు భయపడుడితీర్పుకలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.