Connect Christ

Telugu Bible · Old Testament

యెహోషువ 4

Joshua 4 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1జనులందరు యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను

2ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని చొప్పున పన్ని ద్దరు మనుష్యులను ఏర్పరచి

3యాజకుల కాళ్లు నిలిచిన స్థలమున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బసచేయు చోట వాటిని నిలువబెట్టుడని వారి కాజ్ఞాపించుము

4కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరచిన పన్నిద్దరు మనుష్యులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించి

5వారితో ఇట్లనెనుయొర్దాను నడుమనున్న మీ దేవు డైన యెహోవా మంద సము నెదుట దాటిపోయి, ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక రాతిని తన భుజముమీద పెట్టుకొని తేవలెను.

6ఇకమీదట మీ కుమారులుఈ రాళ్లెందు కని అడుగునప్పుడు మీరుయెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను.

7అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును,

8అందుకే దీని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రా యేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పి నట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి.

9అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్లు యొర్దాను నడుమ నిలిచిన చోట పండ్రెండు రాళ్లను నిలువ బెట్టించెను. నేటివరకు అవి అక్కడ నున్నవి.

10ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞా పించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞా పించినదంతయు, నెరవేరువరకు యాజకులు మందసమును మోయుచు యొర్దానునడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి.

11జనులందరు దాటిన తరువాత వారు చూచుచుం డగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి.

12మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయు లును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధసన్నద్ధులై దాటిరి.

13సేనలో ఇంచుమించు నలువది వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటివచ్చిరి.

14ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయు లందరి యెదుట యెహోషువను గొప్పచేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రదుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి.

15యెహోవాసాక్ష్యపు మందసమును మోయు యాజ కులకు యొర్దానులోనుండి యివతలికి రండని

16ఆజ్ఞాపించు మని యెహోషువతో సెలవియ్యగా

17యెహోషువ యొర్దానులోనుండి యెక్కి రండని ఆ యాజకుల కాజ్ఞా పించెను.

18యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుమనుండి యెక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్లు పొడినేలను నిలువగానే యొర్దాను నీళ్లు వాటిచోటికి ఎప్పటివలెనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను.

19మొదటి నెల పదియవ తేదిని జనులు యొర్దానులోనుండి యెక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా

20వారు యొర్దానులో నుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి

21ఇశ్రాయేలీయులతో ఇట్లనెనురాబోవు కాలమున మీ సంతతివారు ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురుగదా;

22అప్పుడు మీరుఇశ్రా యేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దానును దాటిరి.

23ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసు లందరు తెలిసికొనుటకును,

24మీరు ఎల్లప్పుడును మీ దేవు డైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్ళను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.