Connect Christ

Telugu Bible · Old Testament

సామెతలు 5

Proverbs 5 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము

2అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.

3జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి

4దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదునుగలది,

5దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును

6అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును.

7కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.

8జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.

9వెళ్లినయెడల పరులకు నీ ¸°వనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు

10నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును.

11తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు

12అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?

13నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు

14నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలు గుచు నుందువు.

15నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.

16నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?

17అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.

18నీ ఊట దీవెన నొందును. నీ ¸°వనకాలపు భార్యయందు సంతోషింపుము.

19ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.

20నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?

21నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.

22దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.

23శిక్షలేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.