Connect Christ

Telugu Bible · Old Testament

కీర్తనల గ్రంథము 146

Psalm 146 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము

2నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించె దను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను

3రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి

4వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగు దురు. వారి సంకల్పములు నాడే నశించును.

5ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు

6ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.

7బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును.

8యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు

9యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.

10యెహోవా నిరంతరము ఏలును సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.