Telugu Bible · Old Testament
కీర్తనల గ్రంథము 76
1యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.
2షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.
3అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను.(సెలా.)
4దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు.
5కఠినహృదయులు దోచుకొనబడి యున్నారు వారు నిద్రనొంది యున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను.
6యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.
7నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?
8నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి
9దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను.(సెలా.)
10నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.
11మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.
12అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.