Telugu Bible · Old Testament
కీర్తనల గ్రంథము 93
1యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.
2పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను సదాకాలము ఉన్నవాడవు నీవే
3వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి
4విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు
5నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.