Connect Christ

Faith · 11 August 2026

Nellore: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: ఏసురత్నం!

దళిత క్రైస్తవులకు అండగా ఉండాలని దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ... రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దృష్టికి దళిత క్రైస్తవుల సమస్యలు తీసుకువెళ్లి ఉద్దేశంతో..

Nellore: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: ఏసురత్నం!

జై భీమ్ రావు భారత పార్టీ ఏర్పాటుచేసిన సమావేశంలో అధ్యక్షుడు డాక్టర్ మైనంపాటి ఏసు రత్నం, జై భీమ్ రావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ్ కుమార్ నాయకత్వంలో జరిగింది. ఈ సందర్భంగా జై భీమ్ రావు భారత పార్టీ జిల్లా అధ్యక్షులు మైనంపాటి ఏసు రత్నం మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు అండగా ఉండాలి, దళిత క్రైస్తవులకు జరుగుచున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, దళిత క్రైస్తవులకు రావలసిన రాయితీలు, దళిత క్రైస్తవులు భారతదేశంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్, పేరా త్రీ , ఆగస్టు పదిన అమలైనటువంటి రోజు గనుక... ఈరోజు క్రైస్తవులుగా క్రైస్తవ నాయకత్వంలో ఉన్నటువంటి వారందరూ "బ్లాక్ డే" కింద( 'చీకటి రోజు కింద) పరిగణిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి తమ తరపున నిరసన తెలియజేస్తున్నామని, నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో, మండలాలలో ఉన్న నాయకులతో ఈరోజు నెల్లూరులో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. సమావేశంలో ఏడు అంశాలను చర్చించామని, ఈ ఏడు అంశాలలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవులుగా మారినంత మాత్రాన ఎస్సీలు అంటరానితనాన్ని, వివక్షతను ఎదుర్కొంటుందా లేదా అనేది ప్రతి ఒక్క నాయకుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఇప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా... క్రైస్తవులుగా మారినంత మాత్రాన, గౌరవంగా చూడలేదని, ఈరోజు కూడా క్రైస్తవులుగా మారిన ఎస్సీలు, వారి వారి కులాల్లోనే వివాహాలు చేసుకుంటున్నారని, వారి వారి కులాల వారితో కలిసి ఉంటూ ఉన్నారని తెలిపారు. వారు క్రిస్టియన్ అయినంత మాత్రాన ఆర్థికంగా అభివృద్ధి కారని, ఇదేమీ ప్రత్యేకమైన గౌరవానికి కోసం కాదని, వారి ఆత్మీయ ఆనందం కోసం, వారు మతపరమైన విశ్వాసం కోసమేనని, దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకొని క్రైస్తవులుగా మారుతున్నారని, కాబట్టి వెంటనే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయం మీద ఆలోచించాలని కోరారు. అలాగే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, పార్లమెంట్లో ఈ విషయం మీద చర్చ జరగాలని ప్రెసిడెన్సియల్ 1950 తరపున , ఈ క్రైస్తవ సంఘ నాయకుల తరపున తన వాదన వినిపిస్తున్నానని చెప్పారు. క్రైస్తవులను చాలా చులకనగా భారత దేశంలో ఉన్న ప్రభుత్వాలు చూస్తున్నాయని, మరి ఎన్నో రాష్ట్రాలు ఈరోజు క్రైస్తవుల మీద వివక్షతో చూస్తున్నాయని, దానికి ప్రధాన కారణం వారిని మతపరంగా, వారి యొక్క సెన్సెక్స్ లో వారిని ఆడ్ చేయకపోవడమేనని అన్నారు. గతంలో ఎప్పుడో చూపించినటువంటి రెండు శాతం మాత్రమే చూపిస్తున్నారని, భారతదేశంలో 30 నుంచి 40% వరకు క్రైస్తవులు ఉన్నారని చెప్పారు ... దానికి ఉదాహరణ నెల్లూరు జిల్లాలో ఈరోజు విలేకరులందరూ మనం ఆన్లైన్లో ఈరోజు కొట్టి చూస్తే తెలుస్తుందని, నెల్లూరు జిల్లా క్రైస్తవులు జన సంఖ్య ఎంత అండి 22వేల 202 అని, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలలో ప్రతి ప్రతి నియోజకవర్గంలో 50 వేల నుంచి 70, 80 వేల మంది క్రైస్తవులు ఉన్నారని, అయితే ప్రభుత్వం రెండు శాతం మాత్రమే చూపిస్తున్నారని చెప్పారు. 60,000 ఒక సైడ్ ఓట్లు పడితే ఈరోజు ఎమ్మెల్యేగా గెలవలేరా‌..? ఎంతమంది ఎమ్మెల్యేలను గెలుచున్నారు.. ఈరోజు క్రైస్తవులనే వాళ్ళని కులాల వారిగా విడదీసి, వాళ్ళకు ఐక్యత లేదు అనడం దారుణమైన విషయం అని అన్నారు.. ప్రభుత్వాలు క్రైస్తవుల పట్ల సానుకూలంగా స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

More news

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.