Connect Christ

Events · 25 July 2026

క్రిస్మస్ ని ఎందుకు జరుపుకుంటారంటే

ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే క్రిస్మస్ పండుగ ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం!

క్రిస్మస్ ని ఎందుకు జరుపుకుంటారంటే

ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే క్రిస్మస్ పండుగ ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం!

రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. అయితే ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావని తెలిపిందట. అంతే కాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు' అని దేవదూత చెప్పాడు. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒక రోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి' మేరీని నీవు విడిచిపెట్టవద్దు. ఆమె భగవంతుని వరం వల్ల గర్భవతి అయింది. కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరిని వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడు.' అని చెప్పాడు.

తరువాత జోసెఫ్ మేరీ స్వగ్రామం బెత్లేహేమ్‌కు వెళ్లారు. తీరా అక్కడకు చేరుకునేసరికి ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం ఇచ్చాడు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. అలా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబరు 24 న అర్థరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబరు 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ జరుపుకుంటారని చెబుతారు.

More news

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.