Connect Christ

Telugu Bible · Old Testament

కీర్తనల గ్రంథము 128

Psalm 128 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.

2నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించె దవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.

3నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.

4యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.

5సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు

6నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.