Connect Christ

Telugu Bible · Old Testament

కీర్తనల గ్రంథము 129

Psalm 129 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1ఇశ్రాయేలు ఇట్లనును నా ¸°వనకాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి

2నా ¸°వనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి.

3దున్నువారు నా వీపుమీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి.

4యెహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు.

5సీయోను పగవారందరు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక.

6వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును

7కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.

8దారిన పోవువారుయెహోవా ఆశీర్వాదము నీమీద నుండునుగాక యెహోవా నామమున మేము మిమ్ము దీవించు చున్నాము అని అనకయుందురు.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.