Connect Christ

Community · 6 October 2026

అక్టోబర్ 7 నుంచి కుటుంబాలపై పోప్ లియో XIV ప్రత్యేక సమావేశం

కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, గత పదేళ్ల అనుభవాలు, కుటుంబాలతో కలిసి క్రైస్తవ సందేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై బిషప్‌లు, కుటుంబాలు మరియు నిపుణులు చర్చించనున్నారు.

అక్టోబర్ 7 నుంచి కుటుంబాలపై పోప్ లియో XIV ప్రత్యేక సమావేశం

అక్టోబర్ 7 నుంచి కుటుంబాలపై పోప్ లియో XIV ప్రత్యేక సమావేశం

పరిశుద్ధ లియో XIV పాపు గారి ఆధ్వర్యంలో అక్టోబర్ 7 నుంచి 14 వరకు వాటికన్‌లో కుటుంబాలపై ప్రత్యేక సమావేశం జరగనుంది. 2016లో దివంగత పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రచురించిన “Amoris Laetitia” (ప్రేమ యొక్క ఆనందం) పత్రానికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు ఎదుర్కొంటున్న మార్పులు, సమస్యలను పరిశీలించి, కుటుంబాలతో కలిసి క్రైస్తవ సందేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చించనున్నారు. ఇది కేవలం Amoris Laetitia పత్రాన్ని సమీక్షించడం మాత్రమే కాకుండా, గత పదేళ్లలో దేవాలయం మరియు కుటుంబాల్లో జరిగిన అనుభవాల నుంచి ఏమి నేర్చుకున్నామో తెలుసుకునే ప్రక్రియగా వాటికన్ వివరించింది.

ఈ సమావేశాలలో తూర్పు కాథలిక్ దేవాలయ అధిపతులు, ప్రపంచంలోని బిషప్‌ల సమావేశాల అధ్యక్షులు, కుటుంబాలు మరియు నిపుణులు పాల్గొంటారు. వాటికన్ ప్రకారం సుమారు 248 మంది బిషప్‌(పీఠాధిపతులు)లు హాజరవుతారు. కొన్ని కుటుంబాలు తమ వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకోనున్నాయి.

More news

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.